: క‌న్న‌య్య ప‌రిస్థితి విష‌మంగా ఉంది, దీక్ష విర‌మించడానికి ఒప్పుకోవ‌ట్లేదు: వైద్యులు


ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకుడు కన్నయ్యకుమార్ తనతో పాటు తోటి విద్యార్థుల‌కు వర్సిటీ జరిమానా విధించడాన్ని నిరసిస్తూ వారం రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. క‌న్న‌య్య ఆరోగ్యం క్షీణించ‌డంతో ఆయన ఆరోగ్య ప‌రిస్థితిపై డాక్ట‌ర్లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. దీంతో ఆయ‌న‌ను వ‌ర్సిటీలోని మెడికల్ హెల్త్ సెంటర్‌కి త‌ర‌లించారు. క‌న్న‌య్య నిరాహ‌ర దీక్ష విర‌మించ‌బోన‌ని చెప్పాడ‌ని, ఆహారం తీసుకోక‌పోతే క‌న్న‌య్యకు ప్ర‌మాదం పొంచి ఉంటుంద‌ని వైద్యులు హెచ్చ‌రించారు. క‌న్న‌య్య‌తో పాటు దీక్ష కొన‌సాగిస్తోన్న మిగ‌తా 19మంది విద్యార్థులు 4 నుంచి 6 కేజీల బ‌రువు త‌గ్గార‌ని వైద్యులు చెప్పారు. ఈరోజు ఉదయం కన్నయ్య వాంతులు చేసుకున్నాడని వర్సిటీ విద్యార్థి ఒక‌రు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News