: శాస్త్రవేత్తలు అతని బావి వద్దకు క్యూ కడుతున్నారు!


మనదేశంలో ఎక్కడైనా బావిలో నీరు సాధారణంగా చల్లగా ఉంటుంది. అందుకు భిన్నంగా వేడిగా ఉంటే అది వింతే...అలాంటి వింత రాజస్థాన్ లో శాస్త్రవేత్తలను క్యూకట్టేలా చేస్తోంది. బికార్డీ ప్రాంతంలో ఓ పేద రైతు పొలంలో 30 అడుగుల బావిలో 58 డిగ్రీల ఉష్ణోగ్రత కలిగిన వేడి నీరు పడింది. ఎందుకిలా జరుగుతుందో తెలియని ఆ పేద రైతు మాత్రం ఈ వేడి నీటిని మోటారుతో తోడి చల్లార్చి పంటకు వాడుకుంటున్నాడు. సాధారణంగా జపాన్ లో అగ్నిపర్వతాలున్న ప్రాంతంలో ఇలాంటి బావులు కనిపిస్తుంటాయి. అయితే, ఎలాంటి అగ్నిపర్వతాలు లేని రాజస్ధాన్ లోని బావిలో నీరు ఎందుకు ఇలా వేడెక్కుతోందో తెలుసుకునేందుకు జియలాజికల్ పరిశోధకులు అక్కడికి క్యూ కడుతున్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి బావిని రాజస్థాన్ లో చూడలేదని వారు పేర్కొంటున్నారు. భూగర్భంలోని నీటికి ఈ బావి నీరు దగ్గరగా ఉండడంతో వేడిగా మారుతోందని, రాతిలో ఉండే రసాయనాలు ఈ నీటిలో కనిపిస్తున్నాయని, అగ్నపర్వతాలు లేని ప్రాంతం కావడంతో నీటిలో సల్ఫర్ లభ్యం కాలేదని వారు పేర్కొంటున్నారు. దీనిని టూరిస్ట్ స్పాట్ గా మార్చేందుకు రైతుకు కౌన్సిలింగ్ ఇస్తున్నట్టు వారు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News