: కాంగ్రెస్ నేతలు నిజం చెబితే సమస్య ఎదుర్కుంటారు.. అబద్ధం చెబితే విచారణ ఎదుర్కుంటారు: సుబ్రహ్మణ్యస్వామి
అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ కుంభకోణం కేసులో కాంగ్రెస్ నేతలు నిజం చెబితే సమస్య ఎదుర్కుంటారని, అబద్ధం చెబితే విచారణ ఎదుర్కుంటారని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సీబీఐ నుంచి త్వరలోనే సమన్లు అందుకుంటారని సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ కుంభకోణం కేసులో ఇటాలియన్ కోర్టు తమకు పలువురి పేర్లు ఇచ్చిందని, ఆ కోర్టు సమర్పించిన పేర్ల ప్రకారం సదరు వ్యక్తులపై దృష్టి పెట్టామని నిన్న రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ప్రకటించిన నేపథ్యంలో సుబ్రహ్మణ్యస్వామి తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.