: అనుకోని అతిథి ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టింది!
అతిథులు ఇంటికి వస్తే కాలింగ్ బెల్ కొట్టి పిలుస్తారు. కానీ అనుకోని అతిథి వచ్చి కాలింగ్ బెల్ కొడితే? అంతా షాక్ కు గురికావాల్సిందే. అమెరికాలోని సౌత్ కరోలినాలోని ఓ మడుగు నుంచి జనావాసంలోకి వచ్చిన ఎలిగేటర్ (పెద్ద మొసలి) ఓ ఇంట్లోకి ప్రవేశించింది. ఎంతో అలవాటున్న చుట్టంలా నేరుగా డోర్ దగ్గరకెళ్లి కాలింగ్ బెల్ కొట్టింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో డోర్ తెరుచుకోలేదు. ఆ సమయంలో పొరపాటున ఎవరైనా ఉండి, డోర్ తెరిచి ఉంటే దారుణం చోటుచేసుకుని ఉండేది. ఈ తతంగాన్నంతా ఆ ఇంటి పక్కనుండే ఓ వ్యక్తి షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టగా, లైకులు, షేర్లతో ఈ వీడియో దూసుకుపోతోంది.