: ప్రేమించడం లేదంటూ వివాహిత విద్యార్థిని చేతులు నరికి చంపేసిన దుర్మార్గుడు!


తనను ప్రేమించడం లేదంటూ ఒక వివాహిత మహిళ చేతులను నరికేసి, ఆ తర్వాత ఆమెను పొడిచి చంపేశాడో దుర్మార్గుడు. ఈ దారుణ సంఘటన జార్ఖండ్ లోని రామ్ గఢ్ లో జరిగింది. వివాహిత సోనాలి ముర్మ్(30) రామ్ గఢ్ లోని ఒక కళాశాలలో బీఈడీ చేస్తోంది. ప్రతిరోజూ ముర్మ్ భర్త ఆమెను కళాశాల వద్ద దిగపెట్టి వెళుతుండేవాడు. ఈ క్రమంలో నిన్న ఉదయం కళాశాలకు వెళ్లిన ముర్మ్ తిరిగి రాలేదు. కళాశాల గేటు ముందు శవమై పడి ఉంది. ఈ సంఘటనపై రామ్ గఢ్ పోలీసులు మాట్లాడుతూ, ముర్మ్ తో పాఠశాల విద్యనభ్యసించిన సుకేన్ ముండల్(35) ఈ హత్యకు పాల్పడి ఉండవచ్చని అన్నారు. ఎందుకంటే, తనను ప్రేమించమంటూ ముండల్ ఆమె వెంట పడేవాడని, ఇందుకు ఆమె తిరస్కరించడంతో ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని తాము భావిస్తున్నామన్నారు. ముర్మ్ రెండు చేతులు నరికేసి, 20 సార్లు కత్తితో పొడిచి చంపేసినట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. కాగా, ముర్మ్ భర్త చిత్తరంజన్ టుడూ మాట్లాడుతూ, తాము పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ముండల్ తమపై బెదిరింపులకు పాల్పడేవాడని ఆరోపించారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తే లేనిపోని ప్రచారం జరుగుతుందని భావించి తాము సైలెంట్ గా ఉన్నామన్నారు.

  • Loading...

More Telugu News