: సత్యదేవుని కల్యాణ ఆహ్వాన పత్రికలో తప్పులు!
తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలోని సత్యనారాయణ స్వామిని సత్యదేవుడిగా ఆ ప్రాంత ప్రజలు పిలుచుకుంటూ ఉంటారు. అయితే, స్వామి వారి కల్యాణానికి సంబంధించి తయారుచేసిన ఆహ్వాన పత్రికలో పలు తప్పులు చోటుచేసుకున్నాయి. దుర్ముఖి నామ సంవత్సరానికి బదులుగా జయనామ సంవత్సరమని... మంగళవారానికి బదులు శనివారమని ఈ ఆహ్వాన పత్రికలో ముద్రించారు. దీంతో భక్తులు, పలువురు ప్రముఖులు మండిపడుతున్నారు. ఆలయ అధికారుల తీరుపై సర్వత్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.