: హెచ్‌పీ నుంచి చవగ్గా ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌లు
ట్యాబ్లెట్‌ల మార్కెట్ లోకి మరో కంప్యూటర్ దిగ్గజం హెచ్‌పీ కూడా రంగప్రవేశం చేయబోతోంది. ఇదివరలో వారు విండోస్ ఆధారిత ట్యాబ్లెట్‌లతో చేసిన ప్రయోగం విఫలం కాగా ఇప్పుడు సరికొత్త ఆండ్రాయిడ్ జెల్లీబీన్ టెక్నాలజీతో.. 7 అంగుళాల స్క్రీన్ ఉన్న ట్యాబ్లెట్‌లను అందించే ప్రయత్నం చేస్తోంది. హెచ్‌పీ స్లేట్ 7 పేరుతో వ్యవహరించే ఈ ట్యాబ్లెట్ ధర 169 డాలర్లు. అంటే ఇంచుమించు పదివేల రూపాయల లోపుగానే లభిస్తుంది. ఇందులో 2800 మరియు 2801 రెండు సిరీస్‌లలో ట్యాబ్లెట్‌లను విడుదల చేస్తున్నారు.
1.4 గిగాహెట్జ్ కార్టెక్స్ ఎ9 ప్రాసెసర్ స్పీడ్‌తో, 1 జిబి డిడిఆర్ 3 రాం, 3 మెగాపిక్సిల్ వెనుక కెమెరా, విజిఏ ముందు కెమెరా, వైఫై, మైక్రో ఎస్‌డీ స్లాట్ వంటివి ఇందులో ఉంటాయి. అయితే మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ సదుపాయం మాత్రం లేదు. అయితే ఈ విభాగంలో పోటీదారులైన గూగుల్ నెక్సస్ 7, శ్యామ్‌సంగ్ గ్యాలక్సీ వంటి వాటి ధరలు ఎక్కువ కావడంతో 169 డాలర్ల ధర వినియోగదారుల్ని ఆకర్షిస్తుందని హెచ్‌పీ భావిస్తోంది.