: ఇంకొన్ని గంటల్లో కాచిగూడ రైల్వేస్టేషన్ లో హైస్పీడ్ వైఫై సేవలు
నేటి నుంచి దేశంలోని 18 ప్రధాన రైల్వేస్టేషన్ లలో హైస్పీడ్ వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. వైఫై సేవలను మధ్యాహ్నం 3.30 గంటలకు ఢిల్లీలో రైల్వేమంత్రి సురేశ్ ప్రభు ప్రారంభిస్తారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్ లోని కాచిగూడ రైల్వేస్టేషన్ లో కూడా అన్ లిమిటెడ్ హైస్పీడ్ వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఒకటో నంబర్ ప్లాట్ ఫామ్ పై వైఫై సేవల ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్ పాల్గొంటారు.