: యశోద ఆసుప‌త్రిలో అన‌వ‌స‌ర టెస్ట్‌లు చేశారు.. రాజ్యసభ సభ్యుడి ఫిర్యాదుతో ఆసుప‌త్రికి షోకాజ్ నోటీస్


వైద్యం కోసం హైదరాబాదులోని య‌శోద ఆసుపత్రికి వెళ్లిన త‌న భార్యకు అన‌వ‌స‌ర టెస్ట్‌లు చేశార‌ని రాజ్య‌స‌భ స‌భ్యుడు ఎంఏ ఖాన్ చేసిన ఫిర్యాదుతో యశోద ఆసుపత్రికి షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. కొద్ది రోజుల క్రితం త‌న భార్య వైద్యం కోసం య‌శోద ఆసుప‌త్రికి వెళ్లింద‌ని, అయితే ఆమెకు అన‌వ‌స‌ర టెస్టులు చేశార‌ని, స‌రైన వైద్యం అందించ‌లేద‌ని ఎంఏ ఖాన్ అన్నారు. 'రాజ్యస‌భ స‌భ్యుడి భార్యే ఇటువంటి ప‌రిస్థితి ఎదుర్కుంటే వైద్యం కోసం వ‌చ్చే సామాన్యులపై దోపిడీ ఎలా ఉంటుందో' అంటూ ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఎంఏ ఖాన్ ఫిర్యాదుతో కేంద్ర వైద్యారోగ్య శాఖ స‌దరు ఆసుప‌త్రికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News