: గల్లా జయదేవ్ అడిగినవన్నీ మాక్కూడా ఇవ్వండి: తెలంగాణ ఎంపీ జితేందర్ రెడ్డి
లోక్ సభలో ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం ఇవ్వాల్సిన వాటి గురించి స్పష్టమైన ప్రకటన చేయాలంటూ ఎంపీ గల్లా జయదేవ్ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. స్పష్టమైన వాచకంతో, లెక్కలతో సహా వివరిస్తూ, రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ఎత్తిచూపుతూ, రావాల్సిన బకాయిలను ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేయడంతో సభ మొత్తం గంభీరంగా మారిపోయింది. స్పష్టంగా, సూటిగా అడగాల్సిన విషయం అడిగిన గల్లా కూర్చోగానే, తెలంగాణ ఎంపీ జితేందర్ రెడ్డి లేచి మాట్లాడుతూ, మా పక్క రాష్ట్ర నేత గల్లా జయదేవ్ అడిగినవన్నీ మాక్కూడా ఇవ్వాలని కోరారు. ఆయన చెప్పిన లెక్కలన్నీ కాదు కానీ, ఆయన ఏవైతే అడిగారో అవన్నీ తమకు కూడా చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో అంతవరకు గంభీరంగా మారిపోయిన లోక్ సభలో ఒక్కసారిగా నవ్వులు పూశాయి.