: దీదీ సభలో మంచినీళ్ల కోసం కార్యకర్తలతో మహిళల గొడవ.. స్పృహ తప్పి పడిపోయిన వైనం
పశ్చిమ బెంగాల్‌లో చివరిదశ పోలింగ్ కోసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అయితే మమత కూచ్‌బిహార్‌లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న మహిళలు ఎండ వేడితో తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొన్నారు. పలువురు మహిళలు స్పృహ తప్పి పడిపోయారు. కనీసం మంచి నీళ్లయినా అందకపోవడంతో తమకు మంచినీళ్లు కావాలంటూ అక్కడి కార్యకర్తలతో మహిళలు గొడవ పెట్టుకున్నారు. కార్యకర్తలందించిన నీళ్లు అక్కడి మహిళల్లో కొందరికి మాత్రమే లభించాయి. అసలే వేడి, ఆపై నీళ్లు కూడా కరవైపోవడంతో పలువురు మహిళలు సృహతప్పి పడిపోయారు.