: మాది స‌హ‌జీవనం కాదు.. పెళ్లి చేసుకున్నాం.. నా భ‌ర్త‌కు శిక్ష‌ప‌డాల్సిందే: న‌టి పూజిత


త‌న భ‌ర్త విజ‌య్‌గోపాల్‌ త‌న‌ను మోసం చేశాడ‌ని తెలుగు సినీ, బుల్లితెర న‌టి పూజిత పోలీసుల‌కి ఫిర్యాదు చేసిన నేప‌థ్యంలో.. విజ‌య్‌గోపాల్ స్పందిస్తూ పూజిత‌ను తాను అస‌లు పెళ్లి చేసుకోలేద‌ని, ఆమెతో సుమారు ప‌న్నెండేళ్ల‌పాటు స‌హ‌జీవ‌నం మాత్రం చేశాన‌ని నిన్న పేర్కొన్న విష‌యం తెలిసిందే. అయితే విజ‌య్‌గోపాల్ వ్యాఖ్యల‌ను పూజిత ఖండించింది. త‌మ‌ది స‌హ‌జీవనం కాద‌ని తెలిపింది. ‘మేమిద్ద‌రం పెళ్లి చేసుకున్నాం’ అని వ్యాఖ్యానించింది. త‌న భ‌ర్త‌కు శిక్ష ప‌డాల్సిందేన‌ని ఉద్ఘాటించింది. ఐదేళ్ల క్రితం త‌న భ‌ర్త త‌న‌ను, త‌న బిడ్డ‌ను వ‌దిలి వెళ్లిపోయాడని తెలిపింది.

  • Loading...

More Telugu News