: జగన్‌తో ముఖాముఖికి కదిలిన బ్రాండిక్స్ కార్మికులు.. అడ్డుకున్న పోలీసులు.. తీవ్ర వాగ్వివాదం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరికాసేపట్లో విశాఖపట్నంలోని అచ్యుతాపురం చేరుకోనున్న నేపథ్యంలో అక్కడి జంగులూరు వద్ద ఉద్రిక్తత నెలకొంది. బ్రాండిక్స్ కార్మికులతో కష్టాలు చర్చిస్తానంటూ జగన్ పిలుపునివ్వడంతో.. వాహనాలపై తరలివస్తోన్న కార్మికులను జంగులూరు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, వైఎస్సార్ సీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. జగన్‌ను కలిసి తీరుతామంటూ కార్మికులు, వైసీపీ కార్యకర్తలు పోలీసులతో వాదిస్తున్నారు. అచ్యుతాపురంలో కాసేపట్లో జగన్ బ్రాండిక్స్ కార్మికులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననున్నారు.