: పాస్‌పోర్ట్, కరెన్సీ ఉన్న నా బ్యాగును దొంగిలించారు.. సాయం చేయండి: ట‌్విట్టర్‌లో సుష్మాస్వరాజ్‌కు తమిళ సినీ నటి విద్యుల్లేఖ విన్నపం
పాస్‌పోర్ట్, కరెన్సీతో పాటు పలు కార్డులు ఉన్న తన బ్యాగును ఎవరో దొంగిలించారని తమిళ సినీ సినీ నటి విద్యుల్లేఖా రామన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రస్తుతం ఆస్ట్రియాలోని వియన్నాలో ఉన్న తనకు సాయం చేయాలంటూ భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు ఆమె ట్విట్టర్ ద్వారా విన్నవించుకున్నారు. ఓ హోటల్‌లో ఉన్న ఆమె.. తన బ్యాగుని ఎవరో దొంగిలించారని, దొంగల్ని కనిపెట్టేందుకు సదరు హోటల్ మేనేజ్‌మెంట్ తనకు సహకరించడం లేదని పేర్కొన్నారు. అడ్రస్ అడుగుతున్నట్లు ఓ వ్యక్తి తన వద్దకు వచ్చాడని, ఆ వ్యక్తితో తనకు అడ్రస్ తెలీదని చెప్పానని, మరోవైపు నుంచి అడ్రస్ అడిగిన వ్యక్తి ఫ్రెండ్ తన బ్యాగుతో ఉడాయించాడని ఆమె ట్వీట్‌లో పేర్కొంది. క్షణాల్లో జరిగిన సంఘటన తనను షాక్‌కు గురిచేసినట్లు విద్యుల్లేఖ పేర్కొంది.