: ఏపీలో భారీ ఎత్తున ఐపీఎస్ ల బదిలీ


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఏఆర్ అనురాధ, పోలీస్ లాజిస్టిక్స్ ఐజీగా అమిత్ గార్గ్, విశాఖ పోలీస్ కమిషనర్ గా పి.యోగానంద్, దక్షిణ మండల ఐజీగా ఎన్.శ్రీధర్ రావు, పోలీసు రవాణా సంస్థ ఐజీగా వి.వేణుగోపాలకృష్ణ, నిఘా విభాగం ఐజీగా మహేశ్ చంద్ర లడ్డా, సీఐడీ ఐజీగా కె.సత్యనారాయణ, ఎస్బీఐ ఐజీగా పి.శ్రీనివాసులు, న్యాయ విభాగం ఐజీగా ఈ.దామోదర్, లీగల్ మెట్రాలజీ కంట్రోలర్ గా సుందర్ కుమార్ దాస్, అబ్కారీ శాఖ డైరెక్టర్ గా కె.వెంకటేశ్వరరావు, పోలీసు శిక్షణ విభాగం ఐజీగా ఎ.రవిచంద్ర, ఏలూరు రేంజ్ డీఐజీగా పీవీఎస్ రామకృష్ణ, విజయవాడ సంయుక్త పోలీస్ కమిషనర్ గా పి.హరికుమార్, భద్రతా విభాగం డీఐజీగా జె.సత్యనారాయణ, అనంతపురం రేంజ్ డీఐజీగా జె.ప్రభాకర్, విశాఖ రేంజ్ డీఐజీగా సీహెచ్ శ్రీకాంత్, విశాఖ సంయుక్త పోలీస్ కమిషనర్ గా ఏఎస్ ఖాన్, శ్రీకాకుళం ఎస్పీగా జె.బ్రహ్మారెడ్డి, ప్రకాశం జిల్లా ఎస్పీగా ఎం.త్రివిక్రమ వర్మ, విశాఖ గ్రామీణ ఎస్పీగా రాహుల్ దేవ్ శర్మ, రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీగా బి.రాజకుమారి, విజయనగరం ఎస్పీగా ఎల్కేవి రంగారావు, కడప జిల్లా ఎస్పీగా పీహెచ్ డీ రామకృష్ణ, తిరుపతి అర్బన్ ఎస్పీగా ఆర్.జయలక్ష్మిలను బదిలీ చేశారు.

  • Loading...

More Telugu News