: వైఎస్ ఆత్మ కేసీఆర్‌ను ఆవ‌హించింది.. చీక‌టి ఒప్పందంలో భాగ‌మే జ‌గ‌న్ దీక్ష‌: రేవంత్ రెడ్డి


వైసీపీ, టీఆర్ఎస్ పార్టీలపై టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్సార్ ఆత్మ సీఎం కేసీఆర్ ను ఆవ‌హించింద‌ని, అందుకే ప్రాజెక్టుల రీడిజైన్ చేప‌ట్టార‌ని రేవంత్ రెడ్డి విమ‌ర్శించారు. కేసీఆర్ చేస్తోన్న అక్ర‌మాల‌పై తాము మాట్లాడితే తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటున్నామ‌ని టీఆర్ఎస్ నేత‌లు ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. ఏపీ వైసీపీ నేత‌ల‌కు కాంట్రాక్టులు క‌ట్ట‌బెట్టేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం ప్రాజెక్టుల నిర్మాణం చేప‌డుతోంద‌ని అన్నారు. వైసీపీ ఎంపీకి రూ.10వేల కోట్ల ప్రాజెక్టులు ఇచ్చింది వాస్త‌వం కాదా..? అని ప్ర‌శ్నించారు. జగన్ కర్నూలులో ధర్నా చేస్తానని ప్రకటించిన అంశంపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. కేసీఆర్, వైసీపీ చీక‌టి ఒప్పందంలో భాగ‌మే జ‌గ‌న్ దీక్ష అని విమ‌ర్శించారు.

  • Loading...

More Telugu News