: కర్నాటకలో సోమయాగం... ప్రసాదంగా మేక మాంసం!


యాగ ప్రసాదంగా మేక మాంసంను పంచిపెట్టిన సంఘటన కర్నాటకలోని శివమొగ్గ జిల్లా మట్టూరులో జరిగింది. సోమయాగం పేరిట ఏప్రిల్ 22 నుంచి 27వ తేదీ వరకు ఈ యాగం నిర్వహించినట్లు సమాచారం. ఈ యాగంలో ఆవునెయ్యి, సమిధలు, యాగ ద్రవ్యాలతో పాటు 8 మేకలను కూడా బలిచ్చారనే వార్తలు స్థానికంగా కలకలం రేపాయి. మేకలు బలిచ్చిన అనంతరం భక్తులకు మేక మాంసాన్ని ప్రసాదంగా పెట్టారు. పురాతన వేద సంప్రదాయం ప్రకారమే ఈ యాగం నిర్వహించామని నిర్వాహకులు సమర్థించుకుంటున్నారు.

  • Loading...

More Telugu News