: ‘అగస్టా’ కుంభకోణంలో బ్రదర్ అనిల్ కు సంబంధాలున్నాయి: సీఎం రమేష్
అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణంలో హష్కీతో బ్రదర్ అనిల్ కు సంబంధాలున్నాయని టీడీపీ నేత సీఎం రమేష్ ఆరోపించారు. ఈ విషయమై ఖమ్మం జిల్లాలో ఆయనపై కేసు నమోదైందన్నారు. ఈ విషయమై 2012లోనే రాజ్యసభలో తాను ప్రస్తావించినప్పటికీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. సీబీఐతో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయిస్తే నిజాలు బయటపడతాయని సీఎం రమేష్ డిమాండ్ చేశారు. కాగా, అగస్టా వెస్ట్ ల్యాండ్ చోపర్ డీలర్ పై రక్షణ మంత్రి పారికర్ ఈరోజు పార్లమెంట్ లో ఒక ప్రకటన చేయనున్నారు. వీవీఐపీ చోపర్ కేసులో అధికార, విపక్షాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం కొనసాగుతోంది.