: తెలంగాణలో పార్టీలు కూడా ఏకం కావాలి: సీఎం కేసీఆర్
తెలంగాణ లోని పాలమూరు, కాళేశ్వరం ప్రాజెక్టులపై ఏపీ నేతలు అభ్యంతరాలు చెబుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణలో ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ఏపీ నేతలంతా ఒక్కటయ్యారని, అదేవిధంగా తెలంగాణలోని పార్టీలన్నీ కూడా ఏకం కావాలని ఆయన పిలుపు నిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించలేదని, కాగితాల్లో ప్రకటనలిచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. తెలంగాణలో ప్రాజెక్టులను ఆపేందుకు ఒక నేత దీక్ష చేస్తుండగా, మరో నేత కేబినెట్ తీర్మానం చేయించారని కేసీఆర్ పరోక్షంగా జగన్, చంద్రబాబులను విమర్శించారు.