: కోళ్లు, కోడిగుడ్లు అమ్ముకుంటున్న ఐఎస్ ఉగ్రవాదులు
నిధుల కొరతతో సతమతమవుతున్న ఐఎస్ ఉగ్రవాదులు లిబియాలో కోళ్లు, కోడిగుడ్లను అమ్ముకుంటున్నారు. ఐఎస్ ఉగ్రవాదులు సిరెట్ నగరాన్ని ఆక్రమించుకున్న సమయంలో అక్కడి ఆస్తులను వారు స్వాధీనం చేసుకున్నారు. వారు స్వాధీనం చేసుకున్న వాటిలో వ్యవసాయ క్షేత్రాలు, కోళ్ల ఫారాలు కూడా ఉన్నాయి. సిరెట్ నగర వీధుల్లో ముసుగులు ధరించిన ఐఎస్ ఉగ్రవాదులు అతి తక్కువ ధరలకే కోళ్లను, కోడిగుడ్లను విక్రయిస్తున్నారు. కేవలం ఒకటి లేదా రెండు లిబియన్ దినార్లకే ఒక కోడిని విక్రయిస్తుండం గమనార్హం. కాగా, ఐఎస్ తమ అధీనంలో ఉన్న ప్రాంతాల్లో పన్నులు విధించడం, పురాతన వస్తువులు విక్రయించడం, చమురు క్షేత్రాలు, సెక్స్ బానిసలను విక్రయించడం ద్వారా ఆదాయం సమకూర్చుకుంటున్న విషయం తెలిసిందే.