: హాలీవుడ్ పై ఆసక్తి లేదు: దర్శకుడు రాజమౌళి
ప్రస్తుతానికి హాలీవుడ్ పై తనకు ఏమాత్రం ఆసక్తి లేదని దర్శకుడు రాజమౌళి అన్నారు. 63వ జాతీయ సినిమా అవార్డుల ఫంక్షన్ లో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీ వెళ్లారు. హాలీవుడ్ లో ఎప్పుడు సినిమా తీస్తున్నారంటూ ఈ సందర్భంగా అక్కడి మీడియా ప్రశ్నించగా ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు. చిన్నతనంలో తమ తాత చెప్పిన కథలు తనను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయన్నారు. తాత చెప్పిన కథలతో తాను ఎంతో స్ఫూర్తి పొందానని, మన దేశ చరిత్ర, గొప్పదనం, పలు విషయాలకు సంబంధించిన కథలను ఆయన తమకు చెప్పేవారన్నారు. ప్రస్తుతం బాహుబలి-2 చిత్రం పనుల్లో చాలా బిజీగా ఉన్నానని చెప్పారు.