: ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు.. గాజు గ్లాసులు విసిరేసుకున్నారు.. టర్కీ పార్లమెంట్‌లో రెచ్చిపోయిన ఎంపీలు
టర్కీ పార్లమెంట్‌లో ఎంపీలు రెచ్చిపోయారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. టేబుళ్లపై ఉన్న గాజు గ్లాసులను విసిరేసుకున్నారు. మరి కొందరు తమ ముందు ఎంపీలు కొట్టుకుంటున్న దృశ్యాన్ని తమ సెల్‌ఫోన్లలో బందిస్తూ బిజీగా గడిపేశారు. టర్కీ రాజ్యాంగంలో మార్పులు చేసే దిశగా చర్చ జరుగుతోన్న సమయంలో అధికార, విపక్షాల సభ్యులు పరస్పరం విభేదించుకొని ఈ సీన్‌ను సృష్టించారు. టర్కీలో జస్టిస్ అండ్ డెవలప్ మెంట్ పార్టీ అధికారంలో ఉంది. అధికార పార్టీ రాజ్యాంగంలో మార్పులను సమర్ధించింది. సభలోని ప్రతిపక్ష పిపుల్స్ డెమోక్రసీ పార్టీ రాజ్యాంగ సవరణ అవసరం లేదని వాదించింది. దీంతో పార్లమెంట్ లో సభ్యులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.