: స్వాతంత్ర్యం వచ్చిన 69 ఏళ్ల తర్వాత తొలిసారి ఓటేయనున్న ఓటర్లు!
మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 69 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఓటేస్తున్న కూచ్ బెహార్ గ్రామం భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల మధ్య ఉంది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కూచ్ బెహార్ జిల్లాలోని 51 సమూహాలకు చెందిన 9 వేల మంది ఓటర్లు ఈ నెల 5వ తేదీన తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇన్నేళ్లపాటు ఆ గ్రామస్తులను ఏ దేశానికీ చెందిన వారిగా పరిగణించకపోవడంతో వారికి ఓటు హక్కు లేదు. ఈ విషయమై భారత్, బంగ్లాదేశ్ లు చర్చించుకున్న అనంతరం, గత ఏడాది ఆగస్టు 1న ఈ ప్రాంతాలను పంచుకున్నాయి. మొత్తం 162 ప్రజా సమూహాల్లో బంగ్లాదేశ్ కు 111, భారత్ కు 51 ప్రజాసమూహాలు వచ్చాయి. ఈ ప్రజాసమూహాల్లో మొత్తం జనాభా 15 వేల మంది. ఇందులో అర్హత కల్గిన ఓటర్లు సుమారు 9,776 మంది. పశ్చిమబెంగాల్ లో ఈ నెల 5న జరగనున్న చివరి విడత పోలింగ్ లో వీరు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.