: ఆధారాలున్నాయి.. నా భర్తను అరెస్టు చేయండి: నటి పూజిత
తన భర్త విజయ్ గోపాల్ తనను హతమార్చాలని చూస్తున్నాడని ఆరోపించిన తెలుగు సినీ, బుల్లితెర నటి పూజిత.. తన భర్తను అరెస్టు చేసేందుకు తన వద్ద ఆధారాలున్నాయని తెలిపారు. పూజిత భర్తను అరెస్టు చేసేందుకు తగిన ఆధారాలు తీసుకురావాలని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి సూచించిన నేపథ్యంలో ఈరోజు విజయ్ తన భర్తే అనేందుకు కావాల్సిన ఆధారాలన్నీ కమిషనర్ కు అందజేసినట్లు ఆమె మీడియాకు చెప్పారు. తన భర్తపై గతంలో క్రిమినల్ కేసులు సైతం నమోదయ్యాయని తెలిపారు. తనకు ప్రాణభయం ఉండడంతోనే ఆరు రోజుల పాటు ఎవ్వరికీ కనిపించకుండా ఉన్నానని పూజిత చెప్పారు. తన భర్త విషయాన్ని తేల్చేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. తనకు సాయం చేయవల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు.