: ప్రజా జీవితంలో అత్యంత కీలకమేంటో చెప్పిన కేటీఆర్!
ప్రజా జీవితంలో ఉండే రాజకీయ నాయకులు ఎలా నడుచుకోవాలో తెలంగాణ ఐటీ, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో వివరించారు. క్షేత్ర స్థాయిలో ఉండే ప్రజలు, ముఖ్యంగా మహిళలతో ఎటువంటి భేషజాలకు పోకుండా, వారితో మమేకం కావాల్సి వుందని తెలిపారు. ప్రజా జీవితంలో ఇదే అత్యంత ప్రధానమని పేర్కొన్నారు. కాగా, కేటీఆర్ ఇప్పటికే పలు పురస్కారాలను అందుకున్న సంగతి తెలిసిందే. 2015 సంవత్సరానికి గాను 'స్కాచ్ చాలెంజర్ ఆఫ్ ది ఇయర్' అవార్డుతో పాటు 'మోస్ట్ ఇన్ స్పిరేషనల్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్' గానూ గుర్తింపు తెచ్చుకున్నారు.