: ఉత్తరాఖండ్ రాజకీయ సంక్షోభం: హరీశ్‌రావత్‌కు ఓ అవకాశం ఇవ్వాలని కేంద్రానికి సూచించిన సుప్రీం
ఉత్తరాఖండ్ లో హరీశ్ రావత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తొమ్మిదిమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎదురుతిరగడంతో ఉత్తరాఖండ్‌లో రాజకీయాలు రోజుకో మలుపు తిరిగి చివరికి రాష్ట్రపతి పాలన కొనసాగుతోన్న విషయం తెలిసిందే. అసెంబ్లీలో బలపరీక్షకు గతంలో ఉత్తరాఖండ్ హైకోర్టు ఆదేశించింది. అనంతరం పలు పరిస్థితుల దృష్ట్యా బలపరీక్ష నిర్వహించలేదు. అయితే ఈ అంశంపై తాజాగా సుప్రీంకోర్టు స్పందిస్తూ.. హరీశ్ రావత్ ఉత్తరాఖండ్ అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాలని సూచించింది. బల నిరూపణ అంశంపై యోచించాలని కేంద్రానికి చెప్పింది. దీనిపై విచారణ మళ్లీ బుధవారం చేపడతామని చెప్పింది. రాష్ట్రపతి పాలనపైనే ఆసక్తి చూపుతోన్న కేంద్రం దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.