: ప్రధాని నితీష్, ఉపప్రధాని కేజ్రీవాల్: కట్జూ సంచలన వ్యాఖ్యలు
ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఫేస్ బుక్ ద్వారా ఈ మేరకు పలు వ్యాఖ్యలు చేశారు. దేశానికి ప్రధానిగా నితీష్ కుమార్ ను, ఉప ప్రధానిగా అరవింద్ కేజ్రీవాల్ ను ఎన్నుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. సాధారణంగా తాను రాజకీయ నాయకులను విమర్శిస్తుంటానని తెలిపారు. గతంలో వీరిని కూడా విమర్శించానని ఆయన అన్నారు. అయితే, ప్రస్తుత రాజకీయాలను చూస్తుంటే ఉన్నంతలో ఉత్తములను ఎంచుకోవాలనే లక్ష్యంతో వీరిని సూచించానని ఆయన చెప్పారు. నితీష్ కుమార్, కేజ్రీవాల్ లు వ్యక్తిగతంగా ఎలాంటి ఆరోపణలూ ఎదుర్కొన్నట్టు తాను వినలేదని ఆయన తెలిపారు. అందుకే వారిని ప్రధాని, ఉప ప్రధానిగా ఎన్నుకోవాలని సూచిస్తున్నానని ఆయన ఫేస్ బుక్ లో పేర్కొన్నారు.