: జంతర్ మంతర్ వద్ద ఎమ్మార్పీఎస్ ధర్నాకు టీఆర్ఎస్ ఎంపీల మద్దతు


ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఎస్సీ వర్గీకరణను డిమాండ్ చేస్తూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) ధర్నాకు దిగింది. ఎస్సీ రిజర్వేషన్లలో మాదిగ ఉపకులాలకు అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు చేస్తున్న ఈ ధర్నాకు టీఆర్ఎస్ ఎంపీలు మద్దతు తెలిపారు. జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్న ఎమ్మార్పీఎస్ శిబిరాన్ని టీఆర్ఎస్ ఎంపీలు కవిత, జితేందర్ రెడ్డి, వినోద్ తదితరులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు ఎమ్మార్పీఎస్ డిమాండ్ న్యాయబద్ధమైనదని పేర్కొన్నారు. వారి డిమాండ్ ను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News