: రాజ్యసభ సభ్యత్వానికి విజయ్ మాల్యా రాజీనామా
ప్రముఖ పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యా తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ స్థాపించి, వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగనామం పెట్టిన విజయ్ మాల్యా దేశాన్ని మోసం చేశారంటూ గత కొన్ని రోజులుగా వార్తా కథనాలు ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆయన చెప్పాపెట్టకుండా బ్రిటన్ వెళ్లిపోయారు. ఈ క్రమంలో బ్యాంకుల కన్సార్టియం చేసిన ఫిర్యాదుతో పాటు, ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) ఒత్తిడి మేరకు ఆయన పాస్ పోర్టును కేంద్రం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఎంపీగా ఎలా కొనసాగుతారంటూ విమర్శలు రావడంతో ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.