: తెలంగాణ ఎంసెట్ 15న, టెట్ 22న : కడియం ప్రకటన


ఇటీవల వాయిదా వేసిన ఎంసెట్, టెట్ పరీక్షల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. నీట్ ను నిర్వహించి తీరాల్సిందేనంటూ సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈనెల 2వ తేదీన నిర్వహించాల్సిన ఎంసెట్ పరీక్షను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నేడు ప్రకటన చేశారు. ఈ నెల 15న తెలంగాణ ఎంసెట్ ను నిర్వహిస్తామని స్పష్టం చేసిన ఆయన, ఈ నెల 22న టెట్ పరీక్ష నిర్వహించనున్నామని తెలిపారు. ఎంసెట్ హాల్ టికెట్లను ఈ నెల 12 నుంచి, టెట్ హాల్ టికెట్లను 13 నుంచి ఆన్ లైన్లో డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఆయన చెప్పారు. 27న ఎంసెట్ ర్యాంకులను ప్రకటిస్తామని, జూన్ లో కౌన్సిలింగ్ నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News