: గుక్కెడు నీళ్లివ్వలేని స్థితిలో బాబు సర్కార్ ఉంది: బొత్స సత్యనారాయణ
ఏపీ లో ప్రజలకు కనీసం గుక్కెడు నీళ్లివ్వలేని స్థితిలో చంద్రబాబు నాయుడు సర్కార్ ఉందని వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఏపీలో కరవుపై వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న పోరుబాటలో భాగంగా విజయనగరం జిల్లా చీపురుపల్లి తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆయన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలు పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఎంపీలు ఆ విధంగా చేయలేని పక్షంలో కేంద్ర కేబినెట్ నుంచి బయటకు రావాలని అన్నారు.