: ఇంకా చేతి దురద తీరలేదు: వినోద్ కాంబ్లీ
క్రికెట్ పట్ల ఇంకా తన చేతి దురద తీరలేదని, బ్యాటు తీసుకుని కసిదీరా బంతిని బౌండరీలకు పంపాలని ఉందని వెటరన్ క్రికెటర్ వినోద్ కాంబ్లీ అంటున్నాడు. ముంబై ఇండియన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన టీ-20 పోరును తన కొడుకుతో కలిసి చూసిన కాంబ్లీ, తన చేతులు దురద పెడుతున్నాయని ట్వీట్ చేశాడు. తనలాగే ఆడుతున్న గంభీర్ షాట్లు కొడుతుంటే ఆనందం వేసిందని, అతన్ని అభినందించినట్టు చెప్పాడు. దిలీప్ వెంగ్ సర్కారుతో మాట్లాడానని తెలిపాడు. కాగా, 2011లో క్రికెట్ కు రిటైర్ మెంట్ ప్రకటించిన కాంబ్లీ, తన మొదటి ఏడు టెస్ట్ మ్యాచ్ లలో నాలుగు సెంచరీలు చేసి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చి, అంతే వేగంగా వివాదాల్లో మునిగి ఆటకు దూరమైన సంగతి తెలిసిందే.