: దటీజ్ రజనీ క్రేజ్.. యూట్యూబ్‌లో ‘క‌బాలీ’కి ఇప్పటి వ‌ర‌కు 54 లక్షల హిట్లు!


సౌత్ ఇండియా సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. స్టైలుకే స్టైలు నేర్పించే స్టార్‌గా ర‌జ‌నీని పేర్కొంటూ ఆయ‌న‌ అభిమానులు సూప‌ర్‌స్టార్ కి నీరాజ‌నాలు ప‌లుకుతారు. ర‌జ‌నీకున్న క్రేజ్ ఏంటో మ‌రోసారి బ‌య‌ట ప‌డింది. తెల్లగెడ్డంతో, త‌నదైన స్టయిల్ ని క‌న‌బ‌రుస్తూ విడుద‌లైన ర‌జ‌నీ 'క‌బాలీ' టీజ‌ర్‌కు యూట్యూబ్‌లో హిట్ల‌పై హిట్లు వ‌చ్చిప‌డుతున్నాయి. తమిళంలో విడుదల చేసిన క‌బాలీ టీజ‌ర్‌కు ఒక్క‌రోజులోనే 54 లక్షల హిట్లు వ‌చ్చాయి. ఇటు తెలుగులోనూ 5.81 లక్షల వ్యూస్ వ‌చ్చాయి. టీజ‌ర్‌లో ర‌జనీ డైలాగ్‌, త్రీ పీస్ సూట్, తెల్ల‌గ‌డ్డం అభిమానుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటున్నాయి. యూ ట్యూబ్‌లో సంచ‌ల‌నాలు సృష్టిస్తూ దూసుకుపోతున్న ‘క‌బాలీ’ రేపు బాక్సాఫీస్ వ‌ద్ద ఎన్ని సంచ‌ల‌నాలు సృష్టిస్తాడో.

  • Loading...

More Telugu News