: విజ‌య‌వాడ‌లో దారుణం.. ఆసుప‌త్రిలో చీమ‌లుకుట్టడంతో నాలుగురోజుల ప‌సికందు మృతి


విజ‌య‌వాడ ప్ర‌భుత్వాసుప‌త్రిలో దారుణం చోటుచేసుకుంది. ఆసుప‌త్రి సిబ్బంది నిర్ల‌క్ష్యం నాలుగు రోజుల ప‌సికందు ప్రాణాన్ని తీసింది. ఆసుప‌త్రిలోని మెట‌ర్నిటీ వార్డులో చీమ‌లు కుట్టి నాలుగురోజుల‌ ప‌సికందు మృతి చెందింది. నాలుగు రోజుల‌యినా నిండ‌ని త‌మ బిడ్డ మృత్యువాత‌ప‌డ‌డంతో ఆ శిశువు త‌ల్లిదండ్రులు క‌న్నీరుమున్నీర‌వుతున్నారు. ప‌సికందు మృతిపై ఆందోళ‌న‌కు దిగారు. త‌మ బిడ్డ మ‌ర‌ణానికి కార‌ణ‌మైన ఆసుప‌త్రి సిబ్బందిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు. చీమ‌లు కుట్టి ప‌సికందు మ‌ర‌ణించిన ఘ‌ట‌న‌పై స్థానికులు మండిప‌డుతున్నారు.

  • Loading...

More Telugu News