: పూజారి అవతారమెత్తిన జాంటీ రోడ్స్... మీరూ చూడండి!
జాంటీ రోడ్స్... ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెట్ ఫీల్డర్లలో ఒకడిగా, సౌతాఫ్రికా జట్టుకు ఎన్నో విలువైన ఇన్నింగ్స్ అందించిన ఆటగాడిగా, ఎన్నో ఏళ్లుగా ముంబై ఇండియన్స్ జట్టుకు కోచింగ్ స్టాఫ్ లో ఒకడిగా ఉన్న వ్యక్తని అందరికీ తెలుసు. ఇండియా తనకు రెండో ఇల్లని, హిందూ మత విశ్వాసాలపై తనకెంతో గౌరవమని చెప్పుకునే జాంటీ రోడ్స్, తాజాగా పూజారి అవతారం ఎత్తి దుర్గమ్మకు పూజలు చేశాడు. సంప్రదాయ పంచె కట్టుకుని ముంబయ్ లోని పెజావర్ మఠానికి వచ్చిన ఆయన కనకదుర్గమ్మకు ప్రత్యేకంగా పూజలు చేశాడు. ఈ చిత్రాన్ని సామాజిక మాధ్యమ ఖాతా ట్విట్టర్ లో పెట్టగా, వీరేంద్ర సెహ్వాగ్ సహా పలువురు క్రికెటర్లు దీన్ని షేర్, రీట్వీట్ చేస్తున్నారు. జాంటీ రోడ్స్ సంప్రదాయ పూజ చేస్తున్న చిత్రాన్ని మీరూ చూడండి.