: రెండు చేతులు పైకెత్తి చెప్పండి.. ఇళ్లు క‌ట్టిచ్చారా..? జాబ్ ఇచ్చారా..? : జ‌గ‌న్


క‌ర‌వుపై గుంటూరు జిల్లా మాచ‌ర్ల‌లో వైసీపీ చేప‌ట్టిన నిర‌స‌న కార్య‌క్ర‌మంలో ఆ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఉద్వేగ‌పూరిత ప్ర‌సంగం చేశారు. ‘రెండు చేతులు పైకెత్తి చెప్పండి.. ఇళ్లు క‌ట్టిచ్చారా..? జాబ్ ఇచ్చారా..? క‌రవు ప‌రిస్థితిపై చ‌ర్య‌లు తీసుకుంటున్నారా..?’ అని వ్యాఖ్యానించారు. చంద్ర‌బాబు పాల‌న అంతా మోసం, ద‌గా అని తీవ్రస్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. మాచ‌ర్ల ప‌ట్ట‌ణంలో తాగ‌డానికి నీళ్లు లేవని అన్నారు. తెలంగాణ‌కు నీళ్ల‌ను మ‌ళ్లించేలా పాల‌మూరు ప్రాజెక్టును క‌డుతున్నా తెలంగాణ ప్ర‌భుత్వాన్ని చంద్ర‌బాబు ఎందుకు ప్ర‌శ్నించ‌డంలేదని దుయ్య‌బ‌ట్టారు. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో ఎత్తిపోత‌ల ద్వారా కేసీఆర్ కృష్ణా నీటిని మ‌ళ్లిస్తున్నారని మ‌రి ఆంధ్ర ప‌రిస్థితి ఏంట‌ని ప్ర‌శ్నించారు. కేసీఆర్ పై చంద్ర‌బాబు ఒక్క‌మాట కూడా మాట్లాడ‌రని విమ‌ర్శించారు. అప్ప‌ట్లో బుగ్గ‌వాగు నుంచి మాచ‌ర్ల‌కు తాగునీటి ప‌థ‌కానికి వైఎస్ రూ.17కోట్లు మంజూరు చేశారన్నారు. దానిపై రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్లక్ష్యం వ‌హిస్తోంద‌ని విమ‌ర్శించారు. గోలివాగు, జ‌ర్రివాగు ప‌థ‌కాలను గురించి కూడా అడిగేవారు లేరని వ్యాఖ్యానించారు. రైతుల‌కి నీళ్లు ఎలా ఇవ్వాలో సీఎం ఆలోచించ‌డం లేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఇచ్చిన రుణ‌మాఫీ వ‌డ్డీలోని మూడో వంతుకు కూడా స‌రిపోద‌ని అన్నారు. ‘డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామ‌న్నారు చేయలేదు, బాబు వ‌చ్చినా జాబ్ రాలేదు, పేద‌ల‌కు ఇంత‌వ‌ర‌కూ ఇళ్లు క‌ట్టించ‌లేదు’ అని విమ‌ర్శించారు.

  • Loading...

More Telugu News