: ఖాళీ బిందెతో ర్యాలీలో పాల్గొన్న జగన్.. ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
కరవుపై గుంటూరు జిల్లా మాచర్లలో వైసీపీ చేపట్టిన ధర్నాకు భారీగా పార్టీ కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు. మాచర్ల మున్సిపల్ ఆఫీస్ నుంచి ఖాళీ బిందెలతో వైసీపీ ర్యాలీ చేపట్టింది. ర్యాలీలో పాల్గొన్న వైసీపీ అధినేత జగన్ ఖాళీ బిందెతో నిరసన వ్యక్తం చేశారు. తలపై ఖాళీ బిందెను మోసి, నిరసన తెలిపారు. అనంతరం జగన్ మాట్లాడుతూ... ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కరవు సమస్య తీరేవరకు వైసీపీ తమ పోరాటాన్ని కొనసాగిస్తుందని తెలిపారు. కరవు పరిస్థితులపై టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. కరవు నివారణ చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.