: అభివృద్ధి కోసమే టీఆర్ఎస్ లోకి!... కలిసి వచ్చేవారందరికీ స్వాగతం!: పొంగులేటి ప్రకటన


ఊగిసలాట పటాపంచలైపోయింది. టీఆర్ఎస్ లోకి చేరుతున్నట్లు వైసీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించేశారు. నేటి ఉదయమే పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లి మరీ తాను పార్టీ మారుతున్నట్లు ముఖం మీదే చెప్పేసి వచ్చిన పొంగులేటి... ఖమ్మంలో తన ముఖ్య అనుచరులతో భేటీ అయ్యారు. ఈ భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. అభివృద్ధి కోసమే తాను టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించిన పొంగులేటి... తనతో కలిసి వచ్చేవారందరికీ స్వాగతం పలుకుతున్నానని చెప్పారు. తన పార్టీ మార్పునకు దారి తీసిన కారణాలను నేటి మధ్యాహ్నం 3 గంటలకు ఏర్పాటు చేయనున్న మీడియా సమావేశంలో వివరిస్తానని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News