: దివాలా తీసిన వ్యక్తులపై ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం... కొత్త చట్టం!


బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాలను ఏళ్ల తరబడి ఎగ్గొట్టి, ప్రజా ప్రతినిధిగా హోదాను అనుభవించి, విదేశాలకు చెక్కేసిన విజయ్ మాల్యా ఉదంతం కొత్త చట్టాన్ని తెచ్చే దిశగా మోదీ సర్కారు ప్రణాళికలు వేసేలా చేసింది. దివాలా తీసిన వ్యక్తి ఎటువంటి ఎన్నికల్లోను పోటీ చేయకుండా నిషేధం విధించేలా కొత్త చట్టాన్ని తీసుకురావాలని భావిస్తోంది. పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ, మాల్యాను ఎంపీ పదవి నుంచి డిస్ క్వాలిఫై చేయాలని సిఫార్సు చేయనున్నట్టు తెలుస్తుండగా, దివాలా బిల్లుపై బీజేపీ ఎంపీ భూపేందర్ యాదవ్ నేతృత్వంలో ఏర్పడిన సంయుక్త కమిటీ, పలు సూచనలు చేసింది. వీటిని మంత్రివర్గం ఆమోదిస్తే, భారత ఇన్ సాల్వెన్సీ అండ్ బ్యాంక్ రప్టసీ చట్టానికి సవరణ జరిగి, దివాలా తీసిన వ్యక్తులు ప్రజా ప్రతినిధులుగా మారకుండా అడ్డుకుంటుంది. స్థానిక, పట్టణ స్థాయి నుంచి అసెంబ్లీ, పార్లమెంట్ వరకూ ఎలాంటి ఎన్నికల్లోనూ వీరు పాల్గొనకుండా చూడాలన్నది భూపేందర్ కమిటీ ప్రధాన సిఫార్సు. గడచిన కొంత కాలంగా పార్లమెంట్, అసెంబ్లీల్లోకి ప్రవేశిస్తున్న వ్యాపారవేత్తల సంఖ్య పెరుగుతుండటంతో, వీరు చెల్లించాల్సిన బకాయిలు, భారత పెట్టుబడుల వాతావరణాన్నే కలుషితం చేస్తున్నందున దీనికి అడ్డుకట్ట వేయాలన్నది మోదీ సర్కారు అభిమతం.

  • Loading...

More Telugu News