: 'పర్ఫెక్ట్ మ్యాన్' అన్న పదానికి నిదర్శనం మా నాన్న!: హీరోయిన్ అనుష్క
‘కళ్లలో నిజాయతీ కనిపించాలి. అలాంటి మగవాళ్లంటే నాకు ఇష్టం. అందుకే, సన్ గ్లాసెస్ పెట్టుకున్న మగవాళ్లతో మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు’ అని దక్షిణాది హీరోయిన్ అనుష్క తన మనసులోని మాట చెప్పింది. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, మన కళ్లు, నవ్వు మనం ఎలాంటి వ్యక్తనే విషయాన్ని చెబుతాయని చెప్పింది. స్వచ్ఛంగా నవ్వే అబ్బాయిలంటే తనకు ఇష్టమని, హాలీవుడ్ నటుడు జార్జ్ క్లూనీ కళ్లల్లో నిజాయతీ కనిపిస్తుందని ఆమె చిరునవ్వు చిందించింది. ఈ సందర్భంగా తన తండ్రిపై ప్రశంసల వర్షం కురిపించింది. పర్ఫెక్ట్ మ్యాన్ కి నిదర్శనం తన తండ్రి అని, ఆయనలా ఉండటం ఏ అబ్బాయి వల్లా కాదని కితాబిచ్చింది. తనకు సింప్లిసిటీ, నిజాయతీ అంటే ఇష్టమని, తన చుట్టూ ఉండే వాళ్లు కూడా అలానే ఉండాలని కోరుకుంటానని యోగా సుందరి అనుష్క చెప్పింది.