: మండే ఎండలో నీటికి కటకట... ఆగిన నవజీవన్ ఎక్స్ ప్రెస్


బోగీల్లో విద్యుత్, నీటి సరఫరా సక్రమంగా లేదంటూ నవజీవన్ ఎక్స్ ప్రెస్ ప్రయాణికులు మండిపడుతున్నారు. ఎస్6, ఎస్7 బోగీల్లో విద్యుత్, నీటి సమస్య ఉందంటూ ప్రయాణికులు రైలు చైన్ లాగారు. దీంతో గుంటూరు జిల్లా బాపట్ల రైల్వేస్టేషన్ లో గంటకు పైగా రైలు నిలిచిపోయింది. సమస్యలను తక్షణం పరిష్కరించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. అసలే ఎండలు మండుతున్నాయని, బోగీల్లో ఫ్యాన్లు తిరగడం లేదని, నీళ్లు రావడం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఒకానొక దశలో ప్రయాణికులు, కానిస్టేబుళ్ల మధ్య వాగ్వాదం జరిగింది.

  • Loading...

More Telugu News