: వైసీపీ టెంట్లు పీకేసిన పోలీసులు... ఒంగోలులో మండుటెండలోనే విపక్ష నేతల ధర్నా


ఏపీలో కరవు నివారణ చర్యల్లో టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ ‘పోరుబాట’ పేరిట ఆందోళనలకు దిగిన విపక్ష వైసీపీకి ప్రకాశం జిల్లాలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నిరసనల్లో భాగంగా ప్రకాశం జిల్లాకు చెందిన ఆ పార్టీ నేతలు ఒంగోలులోని కలెక్టరేట్ ముందు ధర్నాకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ ఏర్పాట్లలో భాగంగా మండుటెండ నుంచి రక్షణ కోసం వారు టెంట్లు కూడా వేసుకున్నారు. కాసేపట్లో ధర్నా మొదలుకానుండగా కొద్దిసేపటి క్రితం రంగంలోకి దిగిన పోలీసులు కలెక్టరేట్ ఎదుట ధర్నాకు అనుమతి లేదంటూ ఆ టెంట్లను పీకి పారేశారు. దీంతో షాక్ తిన్న వైసీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయినా ససేమిరా అన్న పోలీసులు... ధర్నా చేసే ముందు అనుమతి తీసుకోవాలన్న విషయం తెలియదా? అంటూ వైసీపీ నేతలపై ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో చేసేదేమీ లేక వైసీపీ నేతలంతా మండుటెండలో, నడిరోడ్డుపైనే ధర్నాకు దిగారు.

  • Loading...

More Telugu News