: కోడెలకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
ఏపీ అసెంబ్లీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ కు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫోన్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు ఆయనకు బర్త్ డే గ్రీటింగ్స్ తెలియజేశారు. గుంటూరు, నరసరావుపేటలోని టీడీపీ కార్యాలయాల్లో కోడెల జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాగా, 2 మే 1947న కోడెల జన్మించారు. 1983 నుంచి 2004 వరకు వరుసగా ఐదుసార్లు నరసరావుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత రెండు సార్లు ఓటమిపాలయ్యారు. 2014లో సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. శాసనసభకు ఆరుసార్లు ఎన్నికైన కోడెల, ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గంలో పనిచేశారు.