: దావూద్ రహస్యాలన్నీ తెలుసు... ప్రధానికి మాత్రమే ఇస్తానంటున్న గుజరాత్ యువకుడు


పాక్ లో తలదాచుకున్నాడని భావిస్తున్న ఇండియాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గురించిన ఎంతో విలువైన రహస్య సమాచారం తన వద్ద ఉందని గుజరాత్ కు చెందిన మనీష్ భాంగోరే చెబుతున్నారు. ఆయన మాట్లాడిన ఫోన్ కాల్స్ తాను రికార్డు చేశానని, తన వద్ద ఉన్న సాక్ష్యాలను ప్రభుత్వానికి ఇస్తానని అంటున్నారు. అయితే, ప్రధాని నరేంద్ర మోదీకి మాత్రమే వీటిని అప్పగిస్తానని కండిషన్ పెడుతున్నాడు. తన వద్ద ఉన్న సాక్ష్యాలు తప్పయితే, ఉరితీయాలని మనీష్ వ్యాఖ్యానించినట్టు 'దైనిక్ భాస్కర్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. తన వద్ద దావూద్ వివరాలు వెల్లడించే ఎంతో సమాచారం ఉందని, ఇండియా నుంచి దుబాయ్ కి నల్ల ధనాన్ని బట్వాడా చేసేందుకు దావూద్ వేసిన ప్రణాళికల వివరాలున్నాయని అంటున్నారు. ఈ సమాచారాన్ని సేకరించేందుకు తన జీవితాన్నే పణంగా పెట్టానని, తొలి దశలో తనను ఎంకరేజ్ చేసిన వడోదరా పోలీసులు, అపై అనవసర ప్రశ్నలతో వేధించారని, ప్రధాని కార్యాలయాన్ని సంప్రదించాలని ప్రయత్నించినా, కుదరలేదని అన్నారు. తాను తప్పుడు ప్రచారం చేస్తున్నానని పోలీసు కమిషనర్ రాధాకృష్ణన్ అసత్యాలు చెబుతున్నారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News