: పెంచిన వేతనం రూ. 5... తిరుగు టపాలో ప్రధానికే!


ఎంఎన్ఆర్ఈజీఏలో భాగంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తుంటే, కేవలం రూ. 5 పెంచి తమను అవమానించారని ఆరోపిస్తూ, జార్ఖండ్ లోని లాతేహార్ ప్రాంత మహిళలు వినూత్న నిరసన చేపట్టారు. వీరికి ఒక రోజు పనికి రూ. 162 వేతనం కాగా, దీన్ని రూ. 167కు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పెంచిన రూ. 5 తమకు ఎందుకూ సరిపోవని ఆరోపిస్తూ, ఇదే విషయాన్ని ప్రధానికి చెబుతూ, పెంచిన రూ. 5ను తిరిగి ఆయనకే పంపారు. ప్రధాని ఢిల్లీ కార్యాలయానికి తమ డిమాండ్ల చిట్టాతో పాటు, రూ. 5 పెట్టి వీటిని పంపారు. కరవుతో నిండిన ప్రాంతంలో ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం ఎంతమాత్రమూ కృషి చేయడం లేదని, నాన్ ఎన్ఆర్ఈజీఏ పనుల్లో రోజుకు రూ. 212 వేతనం ఉండగా, వారితో పోలిస్తే, తమకు తక్కువ వేతనాలు ఉన్నాయని వారు ఆరోపించారు. కరవు మూలంగా పనులు కూడా సరిగ్గా జరగడం లేదని తెలిపారు. ప్రధాని స్వయంగా కల్పించుకుని తమకు చాలినంత వేతనం వచ్చేలా చూడకపోతే, ప్రత్యక్ష నిరసనలకు దిగుతామని వారు డిమాండ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News