: ముక్తీశ్వరుడికి రూ.60 లక్షల బంగారు కిరీటాన్ని సమర్పించిన కేసీఆర్ దంపతులు... కాళేశ్వరం ప్రాజెక్టుకు భూమిపూజ


కరీంనగర్ జిల్లా కాళేశ్వరంలో కొలువై ఉన్న కాళేశ్వర ముక్తీశ్వర స్వామికి టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు భారీ కానుక అందజేశారు. సతీసమేతంగా నిన్న కరీంనగర్ జిల్లా పర్యటనకు వచ్చిన కేసీఆర్... నేటి ఉదయమే జిల్లాలోని మహదేవ్ పూర్ మండలంలోని కాళేశ్వర స్వామి ఆలయానికి చేరుకుని స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కేసీఆర్ దంపతులు రూ.60 లక్షలతో చేయించిన బంగారు కిరీటాన్ని స్వామి వారికి సమర్పించారు. ఆ తర్వాత కన్నెపల్లి వద్ద కాళేశ్వర ప్రాజెక్టులో భాగంగా పంప్ హౌజ్ కు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో పాటు మంత్రులు ఈటల రాజేందర్, నాయిని నర్సింహారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, హరీశ్ రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు డి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News