: ఏపీకి ‘హోదా’ కోసం చంద్రబాబు ఏం చేయాలో చెప్పిన టీ కాంగ్రెస్ సీనియర్!


రాష్ట్ర విభజన తర్వాత కనీసం రాజధాని కూడా లేని నవ్యాంధ్రప్రదేశ్ తీవ్ర ఆర్ధిక సమస్యల్లో చిక్కుకుంది. కేంద్రం ఇతోధికంగా సహాయం చేస్తే మినహా... ఆ రాష్ట్రం ఇప్పుడప్పుడే కోలుకునే పరిస్థితులు లేవు. ఈ క్రమంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఆ రాష్ట్రంలోని అధికార పార్టీ టీడీపీతో పాటు విపక్ష వైసీపీ కూడా డిమాండ్ చేస్తోంది. అయితే ఏపీకి హోదా రావాలంటే ఈ డిమాండ్లు మాత్రమే సరిపోవని తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు చెబుతున్నారు. నిన్న హైదరాబాదులో మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా ఏ పరిస్థితుల్లో వస్తుందో వీహెచ్ తేల్చేశారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నుంచి టీడీపీ బయటకు వస్తే... ఏపీకి ప్రత్యేక హోదా వచ్చి తీరుతుందని ఆయన జోస్యం చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వమని టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాస్తే మాత్రం ఎలాంటి ఫలితం ఉండబోదని కూడా ఆయన చెప్పారు. మోదీ కేబినెట్ లోని తన పార్టీ మంత్రులతో చంద్రబాబు రాజీనామా చేయిస్తేనే ఫలితం ఉంటుందని వీహెచ్ కుండ బద్దలు కొట్టారు.

  • Loading...

More Telugu News