: స్టైల్ అంటే ఇది...తలైవా అంటే ఇది!: 'కబాలి'పై రాజమౌళి ప్రశంసలు


దక్షిణాదిన రజనీకాంత్ ను అభిమానించని సినీ ప్రేమికుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. 'బాహుబలి' సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని అమాంతం పెంచేసిన దర్శకుడు రాజమౌళి 'కబాలి' టీజర్ పై స్పందించాడు. 'కబాలి' టీజర్ లో రజనీ స్టైల్ కు రాజమౌళి ఫిదా అయ్యాడు. దీంతో ట్విట్టర్ లో ఉద్వేగంగా స్పందించాడు. 'రజనీ అంటే ఇది...స్టైల్ అంటే ఇది...తలైవా అంటే ఇది' అని ట్వీట్ చేశాడు. 'కబాలి' టీజర్ ను విడుదల చేసిన గంటల్లోనే సోషల్ మీడియాలో లైకులు, షేర్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. 'కబాలి' టీజర్ కు కోలీవుడ్, టాలీవుడ్, శాండల్ వుడ్ సినీ పరిశ్రమలు మొత్తం అభినందనలు తెలిపాయి.

  • Loading...

More Telugu News