: ప్రత్యేకహోదా ప్రశ్నలపై మండిపడ్డ సుజనా


రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రి హెచ్ పీ చౌదరి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. పర్యవసానంగా టీడీపీ నేతలు ఎక్కడ అడుగుపెట్టినా ప్రత్యేకహోదాపై ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తాజాగా విజయవాడలో టీఎన్టీయూసీ చేపట్టిన ర్యాలీలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు సందర్భాల్లో రాష్ట్రానికి ప్రత్యేకహోదా వస్తుందని చెప్పిన సుజనా చౌదరిని మీడియా ప్రతినిధులు నిలదీశారు. దీంతో ఆయన వారిపై మండిపడ్డారు. తమ రాజీనామాలతో ప్రత్యేకహోదా వస్తుందంటే రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, రాజీనామా లేఖలు మీడియా ప్రతినిధులకు ఇస్తామని, ప్రత్యేకహోదా సాధించి తీసుకురావాలని సవాలు విసిరారు. కేంద్రంలో ఉన్నది తమ మిత్రపక్షమని చెప్పిన ఆయన, ప్రత్యేకహోదా కోసం కష్టపడతామని అన్నారు.

  • Loading...

More Telugu News