: అనుమతులు లేకుండా వైఎస్ నీళ్లు తీసుకెళ్లలేదా?...జగన్ విమర్శలు సరికాదు: వీహెచ్
తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల గురించి వాస్తవాలు తెలుసుకుని వైఎస్సార్సీపీ అధినేత జగన్ మాట్లాడాలని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ సూచించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఎలాంటి అనుమతులు లేకుండా పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ప్రాజెక్టు నుంచి వైఎస్ నీళ్లు తీసుకెళ్లిన విషయం గుర్తు లేదా? అని అడిగారు. తెలంగాణలో నిర్మించనున్న సాగునీటి ప్రాజెక్టుల వల్ల ఆంధ్రప్రదేశ్ కు నష్టం కలుగుతుందని జగన్ మాట్లాడడం సరికాదని ఆయన హితవు పలికారు. ఏపీకి ప్రత్యేకహోదాను విభజన సమయంలోనే ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. దానిని బీజేపీ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.